
సచివాలయమే.. నమ్మండి!
ఇదేదో టీడీపీ కార్యాలయం అనుకుని పొరపాటు పడేరు. ముమ్మాటికీ సచివాలయమే..నమ్మండి. కాకపోతే కూటమి ప్రభుత్వంలోని అరాచకాలకు ఇక్కడ ఎగరేసిన పచ్చ జెండానే నిదర్శనం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసుకన్న పాలకులు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలను సైతం ‘పచ్చ’పాతంగా మార్చేస్తున్నారు. వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామంలోని సచివాలయం వద్ద ఇటీవల టీడీపీ నాయకులు తమ పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఏకంగా అక్కడ శాశ్వత దిమ్మ ఏర్పాటు చేసి టీడీపీ జెండా ఆవిష్కరించడం చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఎంత బరితెగింపు పనికిరాదని ఈసడించుకుంటున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులు, సంబంధిత అధికారులు తమకెందుకొచ్చిందంటూ చూసీచూడనట్లు విధులకు వచ్చిపోతున్నారు.
– వెల్దుర్తి