సిల్వర్‌ జూబ్లీ ప్రవేశాలకు 6 నుంచి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

సిల్వర్‌ జూబ్లీ ప్రవేశాలకు 6 నుంచి దరఖాస్తులు

Published Sat, Apr 5 2025 1:22 AM | Last Updated on Sat, Apr 5 2025 1:22 AM

సిల్వర్‌ జూబ్లీ ప్రవేశాలకు 6 నుంచి దరఖాస్తులు

సిల్వర్‌ జూబ్లీ ప్రవేశాలకు 6 నుంచి దరఖాస్తులు

కర్నూలు సిటీ: క్లస్టర్‌ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సిల్వర్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.వి.ఎస్‌.కుమార్‌ శుక్ర వారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ఏపీ విభజన తరువాత రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మాత్రమే ఈ ఏడాది నుంచి కళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 6 నుంచి 30వ తేదిలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 18న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. 280 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అర్హత పరీక్ష నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు https://cuklap.ac.in,https://www.sjgckurnool.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలకు 9059305168ను సంప్రదించవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో సిల్వర్‌ సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ మహమ్మద్‌ వాహిద్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement