
వీకర్ సెక్షన్ కాలనీలో కార్డెన్ సెర్చ్
కర్నూలు (టౌన్): నాలుగో పట్టణ పోలీసులు స్థానిక వీకర్ సెక్షన్ కాలనీలో శనివారం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రౌడీషీటర్లు, అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్ ఇళ్లల్లో తనిఖీలు చేసి, కాలనీలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎరుకలి నరసింహ వద్ద 20 ప్యాకెట్ల స్టోర్ బియ్యం స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్ మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్డెన్ సెర్చ్ ఆపరేషన్‌లో కర్నూలు నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, కోడుమూరు సీఐ తబ్రేజ్, కర్నూలు సబ్ డివిజన్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.