
కోలుకోలేక విద్యార్థి మృతి
ఎమ్మిగనూరురూరల్: తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి కోలుకోలేక మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గుడేకల్ గ్రామానికి చెందిన వీరేష్, నాగమణి దంపతుల కుమారుడు శ్రీనాథ్(13) స్థానిక జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 6న శ్రీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్లు కర్నూలుకు తరలించారు. అక్కడ కోలుకోలేక సోమవారం రాత్రి మృతిచెందాడు. వడదెబ్బ తగటంతోనే తీవ్ర అస్వస్థకు గురైనట్లు వైద్యులు తెలిపారని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు.