
నిధులు నిర్లక్ష్యంపాలు
● తలుపులు లేక నిరుపయోగంగా విలేజ్ క్లినిక్
ప్యాపిలి పట్టణంలోని నాలుగో సచివాలయం పక్కనే నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌కు తలుపులు లేక పోవడంతో వృథాగా మారింది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.20.80 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించారు. భవన నిర్మాణం పూర్తయినప్పటికీ తలుపులు బిగించేలోపు ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా భవనానికి తలుపులు ఏర్పాటు చేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మందుబాబులు, ఆకతాయిల అసాంఘిక చర్యలకు అడ్డాగా మారింది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వృద్ధుడు కూడా ఇదే భవనంలో తలదాచుకుంటున్నాడు. లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనానికి కేవలం రూ.2 వేలు పెట్టి తలుపులు ఏర్పాటు చేయించడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రజలకు భవనం వినియోగంలోకి రావడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భవనానికి తలుపులు ఏర్పాటు చేయించాలని, మరింత ఆలస్యం చేస్తే ఖర్చు చేసిన నిధులు బూడిదలో పోసిన పన్నీరు కాక తప్పదని ప్రజలు చర్చించుకుంటున్నారు. – ప్యాపిలి