ఉపాధి కూలీల హాజరు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల హాజరు పెంచాలి

Published Fri, Apr 11 2025 1:24 AM | Last Updated on Fri, Apr 11 2025 1:24 AM

ఉపాధి

ఉపాధి కూలీల హాజరు పెంచాలి

ఏపీడీ, ఏపీవోలకు డ్వామా పీడీ ఆదేశాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉపాధి పనులకు కూలీల హాజరు పెంచడంపై వెంటనే దృష్టి సారించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటరమణయ్య ఏపీడీ, ఏపీవోలను ఆదేశించారు. పశువుల షెడ్ల నిర్మాణపు పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని డ్వామా సమావేశ మందిరంలో ఏపీడీలు, ఏపీవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులకు ప్రతి రోజు 1.50 లక్షల మందికి పనులు కల్పించాలనేది లక్ష్యమని, ప్రస్తుతం 80 వేల మంది వరకు హాజరవుతున్నారన్నారు. అన్ని గ్రామాల్లో పనులు పెద్ద ఎత్తున చేపట్టి వలసలను పూర్తిగా నియంత్రించాలని తెలిపారు. ఫాంపాండ్స్‌ పనులు వేగవంతం చేసి మే నెల చివరి నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జవాబుదారి తనంతో పని చేసి లక్ష్యాలను అందుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు పీడీ మాధవీలత,ఏపీడీలు పద్మావతి, లక్ష్మన్న, పక్కీరప్ప, కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీలకు రూ.40.73 కోట్ల రుణాలు

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కె.తులసీదేవి

కర్నూలు(అర్బన్‌): జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో అర్హులైన ఎస్సీలకు రూ.40.73 కోట్ల రుణాలను అందించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్వయం ఉపాధి, రవాణా, వ్యవసాయం తదితర రంగాల ద్వారా ఉపాధి పొందేందుకు మొత్తం 973 మందికి లబ్ధి చేకూర్చేందుకు రూపొందించిన వార్షిక ప్రణాళికకు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ఆమోదం తెలిపారన్నారు. అర్హులు ఈనెల 14 నుంచి మే 10వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

● రూ.3లక్షల వరకు రుణాలను 176 మందికి అందిస్తామని, ఇందులో సబ్సిడీ 60 శాతం, బ్యాంకు లోన్‌ 35 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుందన్నారు.

● రూ.3లక్షలకు పైబడి రుణాలను 493 మందికి అందిస్తామని, ఇందులో సబ్సిడీ 40 శాతం, బ్యాంకు లోన్‌ 55 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుందన్నారు.

● రూ.10 లక్షలకు పైగా విలువ చేసే ఒక్క యూనిట్‌ ( ఈవీ బ్యాటరీ చార్జింగ్‌ యూనిట్‌ ) మాత్రమే ఉందని, ఇందులో సబ్సిడీ 40 శాతం, బ్యాంకు లోన్‌ 55 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుందన్నారు.

● ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌లో 294 యూనిట్లు ఉన్నాయని, ఇందులో రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే వాహనాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఐదుగురు సభ్యులుగా ఉన్న గ్రూపులకు రుణాలు అందిస్తామని, ఇందులో 9 యూనిట్లు ఉన్నాయన్నారు.

ఉపాధి కూలీల హాజరు పెంచాలి 1
1/1

ఉపాధి కూలీల హాజరు పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement