
జాటోత్ రాంచంద్రునాయక్
సాక్షి, మహబూబాబాద్: మొదటి నుంచి అంతా ఊహించినట్టుగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బంజార నాయకులకు నూతన ప్రభుత్వంలో ప్రాధాన్యం లభించింది. ఈ వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్‌ను ప్రభు త్వ విప్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నియామక పత్రం అందచేశారు. అడ్లూ రి లక్ష్మణ కుమార్, ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్యలతోపాటు రాంచంద్రునాయక్‌ను విప్‌లుగా నియమించారు. ఈ ఎన్నికల్లో నలుగురు బంజారా వర్గానికి చెందిన శాసన సభ్యులు ఎన్నిక కాగా ఇందులో రాంచంద్రునాయక్‌కు విప్ పదవి వరించింది.
మంత్రి పదవిపై ఆశ..!
డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌తోపాటు, మహబూబాబాద్ నుంచి మురళీ నాయక్, వైరా నుంచి రాందాసునాయక్, దేవరకొండ నుంచి బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గా గెలిచారు. మూడో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచిన రాంచంద్రునాయక్ డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచిన ధర్మసోత్ రెడ్యానాయక్‌ను 53,131ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో రాంచంద్రునాయ్‌కు మంత్రి పదవే వస్తుందని చర్చ జరిగింది. అయితే మొదటి విడతగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు పదిమంది మంత్రులతో కేబినెట్ ఏర్పడగా.. మంత్రివర్గ విస్తరణలో రాంచంద్రునాయక్ పేరు ఉంటుందని అనుకున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాంసహాయం సురేందర్‌రెడ్డితోపాటు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రయత్నించినట్లు ప్రచారం. అయితే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈనేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రభుత్వ విప్‌ల జాబితాలో రాంచంద్రునాయక్ పేరు ఉండటం గమనార్హం. అయితే విప్ పదవి వచ్చినందుకు పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మంత్రి పదవి రాలేదనే నిరాశతో మరికొందరు ఉన్నారు. ఈ పరిస్థితిలో మరో ఆరు నెలల తర్వాత విస్తరించే రాష్ట్ర మంత్రి వర్గంలో రాంచంద్రునాయక్‌కు అవకాశం లభిస్తుందో.. విప్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందో వేచి చూడాలి.
బంజార సామాజిక వర్గం నుంచి
ప్రాధాన్యం
మంత్రి పదవిపై నిరాశేనా..?
Comments
Please login to add a commentAdd a comment