పగలు, ప్రతీకారాలతో అనర్థాలు
మహబూబాబాద్ రూరల్: పగలు, ప్రతీకారాలతో అనర్థాలు చోటుచేసుకుంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సురేశ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి సురేష్ మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఆవేశంలో తప్పులు చేసినా రాజీపడేందుకు లోక్ అదాలత్ ఒక సదవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కీసర పద్మాకర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది తోర్నాల నగేష్ కుమార్, డేగల సత్యనారాయణ, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
1,183 కేసులు పరిష్కారం
జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా 1,183 కేసులు పరిష్కారం జరిగాయి. 13 మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించగా బాధితులకు రూ.58.95 లక్షలు పరిహారం, ఒక సివిల్ కేసును పరిష్కరించగా రూ.1.50 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. 107 సీసీఐపీసీ కేసులు పరిష్కరించి రూ.51,100 జరిమానా విధించగా 15 బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు పరిష్కరించి రూ.14,300 బాధితుల నుంచి రికవరీ చేశారు. 24 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి, జడ్జి సురేశ్
జాతీయ లోక్ అదాలత్‌లో
1,183 కేసులు పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment