ప్రపంచదేశాలతో పోటీపడేందుకు సిద్ధం కావాలి
● నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మారెడ్డి
మహబూబాబాద్ అర్బన్: సృజనాత్మక ఆవిష్కరణలో విద్యార్థులు ప్రపంచ దేశాలతో పోటీ ప డేందుకు సిద్ధం కావాలని వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి సమయపాలన పాటించి చదివితే లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అనంతరం వివిధ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు, మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పా ల్ బి.లక్ష్మణ్‌నాయక్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీని వాసులు, అధ్యాపకులు అహ్మద్, వినోద్, హాతి రామ్, అన్నపూర్ణ, ప్రభావతి, ఉపేందర్, నాగరాజు, ఉదయ్, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీరాంసాగర్ నీటిని
విడుదల చేయాలని ధర్నా
గార్ల: గార్ల సమీపంలోని పాకాల ఏటికి శ్రీరాంసాగర్ నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని కోరుతూ శనివారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పాకాల ఏటి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. వేసవికాలం ప్రారంభంలోనే పాకాల ఏరు నీళ్లులేక ఎండిపోతుందని, ఈ ప్రాంతంలో వరిపంట సాగు చేసిన పంటలకు నీళ్లులేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మరో వారం రోజుల్లో పాకాల ఏటికి నీళ్లు రాకపోతే ఈ ఏటి పరీవాహక ప్రాంతంలో సాగుచేసిన సుమారు 200 ఎకరాల వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ధర్నాలో పార్టీ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, పోతుల నర్సింహరావు, జి.వీరన్న, జి.శంకర్, రమేష్, సురేష్, వెంకన్న, జితేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
మహిళల
భాగస్వామ్యంతోనే ప్రగతి
● జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీధర్
డోర్నకల్: మహిళల భాగస్వామ్యంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలు అన్ని పాత్రల్లో సమర్థవంతంగా సేవలందిస్తున్నారన్నారు. వైద్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంతోమంది మహిళలు రోగులకు సేవ చేస్తూ మథర్ థెరిసాను గుర్తు చేస్తున్నారని తెలిపారు. మహిళలు ధైర్యంగా ముందడుగేస్తూ అభివృద్ధిపథంలో పయనించాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళా అధికారులు, సిబ్బంది కేక్ కట్ చేయగా డాక్టర్ మురళీధర్ మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాధ్విజ, సీఐ బి.రాజేష్, ఎస్సైలు గడ్డం ఉమ, బి.మౌనిక వైద్యురాలు డాక్టర్ సాధ్విజ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా ఇన్నోవేషన్
సమిట్–25 ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని ఇన్నోవేషన్ గ్యారేజీలో శనివారం రెండు రోజుల స్టూడెంట్ ఇన్నోవేషన్ సమిట్–25ను నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, పరిశ్రమల నిపుణులు, సాంకేతిక అభిరుచిగల వారిని ఒకే వేదికపై చేర్చి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు ఇన్నోవేషన్ సమ్మిట్–25ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రపంచదేశాలతో పోటీపడేందుకు సిద్ధం కావాలి
ప్రపంచదేశాలతో పోటీపడేందుకు సిద్ధం కావాలి
Comments
Please login to add a commentAdd a comment