సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్: ఈనెల 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి 25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఎల్‌ఆర్‌ఎస్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌పై కమిషనర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లే అవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయం వెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి, సబ్ రి జిస్టార్ రవీంద్రబాబు, టీపీఓ సాయిరాం, డీపీఓ హరిప్రసాద్, మానుకోట, తొర్రూర్ కమిషనర్లు నో ముల రవీందర్, శాంతికుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment