మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోu
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు మహబూబాబాద్ మండలం దామ్యతండా జీపీ పరిధి భోజ్యతండాకు చెందిన తేజావత్ వీరన్న. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇరవై గుంటల్లో టమాట సాగు చేశాడు. మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. అసలే మిర్చిపంటకు ధర తగ్గి నష్టపోతుండగా టమాట ధరలు తగ్గి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.’
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో సీజన్ వారీగా రైతులు వరి, పత్తి, మి రప, మొక్కజొన్న, అపరాల పంటలు సాగు చేస్తున్నారు. వీటికి తోడు కూరగా యల పంటలు పండిస్తున్నారు. అయితే కూరగాయలను మార్కెట్‌లో విక్రయానికి తీసుకెళ్తే కనీస ధర పలకడం లేదు. బయట డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి.. అధిక రేట్లకు అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. పంట పండించిన రైతులకు మాత్రం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది.
అధికంగా
టమాట సాగు..
జిల్లా వ్యాప్తంగా రైతులు 1,180 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేశారు. దీనిలో అధిక మొత్తంలో 250 ఎకరాల్లో టమాట పంట వేశారు. అసలే కోతులు, పక్షుల బారినుంచి టమాట పంటను కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పండిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే గిట్టుబాటు కావడం లేదు. దీంతో టమాట రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే ఆకు కూరలను 235 ఎకరాల్లో సాగు చేశారు. ఆకుకూరలకు తెగుళ్లు, మచ్చలు, పురుగులుసోకి దిగుబడి తగ్గింది. మిగిలిన ఆకుకూరలు అమ్ముకుందామంటే మార్కెట్‌లో ధరలు లేవు. తమ కష్టానికి తగిన ఫలితం రావడంలేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని చెబుతుండగా వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, అపరాల పంటలు సాగుచేసిన తర్వాత కూరగాయల సాగు చేస్తున్నారు. ఆశించినంత మేరకు దిగుబడి, ధరలు లేక నష్టపోతున్నామని, మరోసారి కూరగాయలను సాగు చేయాలంటేనే భయపడాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు.
న్యూస్‌రీల్
జిల్లాలో కూరగాలయ సాగు వివరాలు(ఎకరాల్లో)
వంకాయ 75బెండ 125 కాకర 25 దోస 150 చిక్కుడు 55 మునగ 15 సోర 100 పచ్చిమిర్చి 100 బీర 50 టమాట 250 ఆకు కూరలు 235
పండించిన రైతులకు దక్కని ఫలితం
మార్కెట్‌లో డిమాండ్
ఉన్నప్పటికీ కనీస ధర కరువు
పెరుగుతున్న పెట్టుబడులు..
తగ్గుతున్న రాబడి
ఆర్థికంగా నష్టపోతున్న రైతన్న
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment