నిర్మాణ రంగంలో ‘భారతి సిమెంట్’ రారాజు●
● వరంగల్ జోన్ మేనేజర్ శివకుమార్
వర్ధన్నపేట: నిర్మాణ రంగంలో ‘భారతి సిమెంట్’ రారాజుగా ఉందని, ఇందులో భాగంగా ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్‌ను తెలంగాణలో విడుదల చేసిందని వరంగల్ జోన్ మేనేజర్ శివకుమార్ అన్నారు. శనివారం వర్ధన్నపేట పట్టణంలోని మహేశ్వర ఏజెన్సీస్‌లో తాపీ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జోన్ మేనేజర్ శివకుమార్, టెక్నికల్ ఇంజనీర్ సాగర్‌రెడ్డి, మార్కెటింగ్ అధికారి రజనీకాంత్ మాట్లాడుతూ మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి ఆల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణాలకు ఆల్ట్రాఫాస్ట్ సరైన ఎంపిక అన్నారు. భారతి సిమెంట్ వేరే సిమెంట్‌తో పోల్చుకుంటే మూడు రేట్లు మెరుగైందన్నారు. సిమెంట్ తయారీలో జర్మనీ టెక్నాలజీ, రోబోటిక్ ల్యాబ్, టాంపరింగ్ ప్రూఫ్ బ్యాగ్ ఉపయోగిస్తారన్నారు. భారతి సిమెంట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం అందజేస్తామన్నారు. స్లాబ్ కాంక్రేట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సాయపడతారన్నారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి ఆల్ట్రాఫాస్ట్ బలం అధికంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 60 మంది తాపీ మేసీ్త్రలకు రూ. లక్ష ఉచిత బీమా బాండ్లు అందజేశారు. కార్యక్రమంలో డీలర్ కర్ర శ్రీనివాసరెడ్డి, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో బిల్డర్ ఆత్మహత్య
చిల్పూరు : ఆర్థిక ఇబ్బందులతో ఓ బిల్డర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వెంకటాద్రిపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నోముల శ్రీనివాస్(43) బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌కు సుమారు రూ.20లక్షల మేర అప్పు అయ్యింది. అప్పు ఎలా తీర్చాలని కొంతకాలంగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని కేటీఆర్ పార్క్ వద్ద గడ్డిమందు తాగాడు. అనంతరం ఇంటికి చేరుకుని వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి అడగగా విషయం తెలిపాడు. వెంటనే వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నిర్మాణ రంగంలో ‘భారతి సిమెంట్’ రారాజు●
Comments
Please login to add a commentAdd a comment