వైద్యాధికారుల తనిఖీ
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీనర్సింగ్‌హోంలో మంగళవారం జిల్లా వైద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రిలో రికార్డులు, స్కానింగ్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మురళీధర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల ధరల పట్టికను ఏర్పాటు చేయాలని, అర్హత కలిగిన సిబ్బంది, వైద్యులకు సంబంధించిన జిరాక్స్ కాపీలను జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు. స్కానింగ్ సెంటర్‌లో అనుమతి పొందిన రేడియాలజిస్ట్‌లు, గైనకాలజిస్టులు మాత్రమే స్కానింగ్ చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్‌కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
2,377 క్వింటాళ్ల మిర్చి విక్రయం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో 2,377 క్వింటాళ్ల మిర్చి విక్రయాలు జరిగినట్లు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్ మంగళవారం తెలిపారు. రైతులు తీసుకొచ్చిన మిర్చిని వ్యాపారులు ఇ–నామ్ విధానంలో కొనుగోళ్లు జరిపారని పేర్కొన్నారు. తేజ రకం మిర్చి 2,028 క్వింటాళ్లు (5,073 బస్తాలు) వచ్చిందని, క్వింటా గరిష్ట ధర రూ.14,090, కనిష్ట ధర రూ.11,505 పలికిందన్నారు. తాలు రకం మిర్చి 349 క్వింటాళ్లు (872 బస్తాలు) వచ్చిందని, క్వింటా గరిష్ట ధర రూ.7,120, కనిష్ట ధర రూ.6,020 పలికిందని పేర్కొన్నారు.
శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని
పెంపొందించుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్రస్థాయి ఫిజికల్‌సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ద్వితీయస్థానం సాధించిన విద్యార్థి ఎన్.విష్ణువర్ధన్‌ను, గైడ్ టీచర్లను డీఈఓ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానుకోట మండలం మాధావపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్ టాలెంట్ టెస్ట్‌లో ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. టెస్టులతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీయవచ్చన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సంకా బద్రినారాయణ, గైడ్ టీచర్లు బబుల్‌రెడ్డి, ఎఫ్‌పీఎస్‌టీ అధ్యక్షుడు దుడ్డి అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారులు ఆజాద్ చంద్రశేఖర్, మందుల శ్రీరాములు, సైన్స్ అధికారి అప్పారావు, టీచర్లు రాజు, సునీత పాల్గొన్నారు.
మండలిలో
ప్రశ్నించే గొంతుకనవుతా..
తొర్రూరు: ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల పక్షాన శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకనవుతానని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం–నల్లగొండ–వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులతో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. పీఆర్సీ అమలు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపులో పీఆర్‌టీయూ కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందకు కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు హెల్త్ కార్డులు అందించేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌రావు, మండల ఽఅధ్యక్షుడు జినుగ విప్లవ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్లి ముత్తిలింగం, అయా మండలాల ప్రతినిధులు రమేశ్, సురేశ్, నరసింహరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, రఘు, పూర్ణ చంద్రర్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
వైద్యాధికారుల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment