తెలుగు విభాగం అధిపతిగా లింగయ్య
● కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతిగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మామిడి లింగయ్య నియమితులయ్యారు. బుధవారం రాత్రి రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయనకు వీసీ, రిజిస్ట్రార్ ఉత్తర్వులు అందించారు. ఆ విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరు జ్యోతి ఈ ఏడాది జనవరిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విభాగంలో రెగ్యులర్ ప్రొఫెసర్లు ఎవరూ లేరు. నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా సీనియార్టీ ప్రాతిపదికనే నియమించాల్సి ఉన్నప్పటికీ వెంటనే నియమించకుండా యూనివర్సిటీ అధికారులు జాప్యం చేశారు. గత నెలాఖరులో సీనియార్టీని తేల్చేందుకు కమిటీ వేయగా, చైర్మన్ ప్రొఫెసర్ టి.మనోహర్ రెండు రోజుల క్రితం రిపోర్టు ఇచ్చారు. సీనియర్‌గా ఉన్న మామిడి లింగయ్యనే నియమించారు. లింగయ్య 2004లో తెలుగు విభాగంలో పార్ట్‌టైం లెక్చరర్‌గా ప్రవేశించారు. 2013లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. తెలుగు విభాగం అధిపతిగా నియామకంతోపాటు యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీ నుంచి బదిలీ కూడా చేశారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
బీఓఎస్ నియామకంలో జాప్యం..
నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో సీనియార్టీని తేల్చి రిపోర్టును కమిటీ ఇచ్చినప్పటికీ విభాగం అధిపతిని మాత్రమే నియమించారు. బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా ఎవరినీ నియమించలేదు. రెండో సీనియార్టీ ప్రకారం డాక్టర్ మంథిని శంకర్‌ను నియమించాల్సింది. సీనియార్టీలో మూడో స్థానంలో ఉన్న డాక్టర్ చిర్రరాజు తనను బీఓఎస్‌గా నియమించాలని అధికారులను కోరుతున్నట్లు చర్చగా ఉంది. గతంలో ఒకసారి మంథిని శంకర్ బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారని, ఈసారి తనకు అవకాశం కల్పించాలని అడిగినట్లు సమాచా రం. ఆ కమిటీ రిపోర్టు ప్రకారం సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్న మంథిని శంకర్‌ను నియమిస్తారా లేక మూడో స్థానంలోని చిర్ర రా జును నియమిస్తారా అనే అంశం ఒకటిరెండురోజుల్లో తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment