● మానుకోటలో ఘటన
మహబూబాబాద్ రూరల్ : అనారోగ్య సమస్యల కారణంగా ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ కథనం ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు గోప్య తండాకు చెందిన మూడ్ లచ్చిరాం (43) మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో మానసికంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి వచ్చి శనివారం మధ్యాహ్న సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లచ్చిరాం రాత్రి సమయంలో మృతి చెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ దామోదర్ శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ దేవేందర్ ఆదివారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment