నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థులకు చేపట్టిన కంటి పరీక్షలు పూర్తయ్యాయని ఆర్‌బీఎస్‌కే నోడల్ ఆఫీసర్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో పాఠశాలలు, అంగన్‌వాడీల్లోని విద్యార్థులకు పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఆరోగ్య సమస్యలున్న పిల్లలను జీజీహెచ్‌కు తీసుకువచ్చి వైద్య సేవలు అందిచండం జరుగుతుందన్నారు. 1,000 మంది విద్యార్థులను పరీక్షించామన్నారు. ఇందులో 611 మందికి దూరదృష్టి సమస్య ఉందని, వారికి కంటి అద్దాలు అవసరమన్నారు. కంటి సమస్యలు అధికంగా ఉన్న 53 మందిని వరంగల్, హైదరాబాద్ కంటి ఆస్పత్రులకు రెఫర్ చేసినట్లు తెలిపారు. మిగితా విద్యార్థులకు ఎలాంటి కంటి సమస్యలు లేవని, విద్యార్థులు పౌష్టికాహారం, విటమిన్ ఏ కలిగిన పోషకాలను తీసుకోవడం ద్వారా కంటి సమస్యల నుంచి బయటపడుతారని తెలిపారు. ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ప్రతీ విద్యార్థిని పరీక్షించి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన చికిత్సను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment