కనుల పండువగా రథోత్సవం
● ఊరేగిన కురవి వీరభద్రుడు
● తరలివచ్చి తిలకించిన భక్తజనం
కురవి: మండల కేంద్రంలో భద్రకాళి సమేత వీరభద్రుడిని సోమవారం రాత్రి రథంపై ఊరేగించారు. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవారు 8.30గంటలకు గ్రామ సేవకు తరలివెళ్లారు. ఆలయ పూజారులు విజయ్, విజయ్‌కుమార్, అభిలాష్, పుణ్యమూర్తి ఛండీశ్వరుడిని తీసుకొచ్చి అగ్నిహోమం, వాస్తు పూజ చేశారు. చొప్పను మంటలో వెలిగించి రథం చుట్టూ తిప్పి ఊరవతల వదిలేశారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ ప్రత్యేక శావలో తీసుకొచ్చి ప్రదక్షిణలు చేసిన అనంతరం రథంపై అధిష్టింపజేశారు. ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ రవీందర్‌రెడ్డి అర్చకుడు విజయ్‌కుమార్ గుమ్మడికాయలు కొట్టారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ టెంకాయ కొట్టి మొక్కుకున్నారు. భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామి వారి రఽథాన్ని ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేశ్, వెంకటేశ్‌గౌడ్, ఉప్పలయ్య, ఆలయ మాజీ చైర్మన్లు సోమిశెట్టి శ్రీనివాస్, మేక దామోదర్‌రెడ్డి, సీఐ సర్వయ్య, ఎస్సై సతీష్, ఏఎస్సై వెంకన్న రథాన్ని లాగారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులు రథానికి పూలతో అలంకరణ చేశారు. కాగా రథాన్ని గ్రామ పంచాయతీ వరకు తీసుకెళ్లారు. గ్రామస్తుల పూజల అనంతరం తిరిగి ఆలయం వరకు తీసుకొచ్చారు.
కనుల పండువగా రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment