నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించాలి
మహబూబాబాద్ రూరల్: మానుకోట రైల్వేస్టేషన్‌లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ రైల్వే అధికారులకు సూచించారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల పర్యవేక్షణలో భాగంగా రైల్వేస్టేషన్ ను ఎమ్మెల్యే సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగో నంబర్ ప్లాట్ ఫాం నిర్మించకుంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. వరంగల్ రైల్వేస్టేషన్ తరహాలో పూర్తిస్థాయి ప్లాట్‌ఫాం ఉంటేనే పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు ఇబ్బ ందులు ఉండవన్నారు. రోజూ వేలాదిమంది ప్రయాణికులు, లక్షలాది రూపాయల ఆదాయంతో అత్యంత రద్దీగా ఉండే మానుకోట రైల్వేస్టేషన్‌లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలన్నారు. రెండు నిమి షాలు ఆగే రైలును చివరి సెకన్లలో అయినా ఎక్కే అవకాశం నాలుగో ప్లాట్ ఫాం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. రైలు వస్తే శ్రీనివాస టాకీస్ ఏరియాలో విపరీతమైన రద్దీ ఉంటుందన్నారు. నాలుగో నంబర్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తే సమస్యలన్నీ తీరుతాయని పేర్కొన్నారు. అదనపు ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్ కూడా అవసరమే అన్నారు. కార్యక్రమంలో రైల్వే కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గంటా శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, కాంగ్రెస్ నాయకులు రామగోని రాజు, శంతన్ రామరాజు, చలమల్ల నారాయణ, నాళ్ల నర్సింహారావు, సిరిపురం వీరన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్‌ను సందర్శించిన
ఎమ్మెల్యే మురళీనాయక్
Comments
Please login to add a commentAdd a comment