చివరి ఆయకట్టుకు సాగునీరందాలి
● వీసీలో సీఎస్ శాంతికుమారి
మహబూబాబాద్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, నీటిపారుదలశాఖ పనితీరుపై జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాబోయే 10 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్‌సరఫరాలో లోటు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్ల నుంచి విడుదల చేసే నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రెగ్యులర్‌గా తనిఖీ చేయాలి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని ప్రతీ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment