తనవాటా భూమి దక్కడం లేదని దామెరలో యువకుడు..
దామెర: తన వాటా భూమి దక్కడంలేదనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి చి కిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన పున్నం నాగరాజు(36) తన కు వారసత్వంగా రావాల్సిన ఎకరం భూమిని త న సొంత అక్క ఉమారాణితోపాటు చిన్నమ్మ కుమారులు రామకృష్ణ, పూర్ణచందర్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో నాగరాజు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ సమయంలో నాగరాజుకు భూ మి ఇస్తామని ఒప్పుకుని తర్వాత ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు.. జనవరి 24న గడ్డిమందు తాగి అపస్మార క స్థితికి చేరుకున్నాడు. గమనించిన బంధువులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందు తూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. నాగరాజు భార్య మమత ఫిర్యాదు మేరకు ఉమారాణి, రామకృష్ణ, నార్లగిరి పూర్ణచందర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment