ఉసురు తీసిన అప్పులు..
అప్పులు, ఆర్థిక బాధలు భరించలేక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పంట, ట్రాక్టర్ కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ మహిళా కౌలు రైతు, ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
దుగ్గొండి: పంట సరిగా పండ క.. పండిన పంటకు గిట్టుబా టు ధర లేక.. తెచ్చిన అప్పు తీర్చలేక ఓ మహిళా కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని మహ్మదాపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధం లక్ష్మి(52), మొగిలి దంపతులు 5 సంవత్సరాలుగా ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అయితే పంట సరిగా పండక.. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక.. పెట్టుబడి అప్పు రూ.. 5లక్షలకు పెరిగింది. దీంతో అప్పులు ఎలా తీ ర్చాలని దంపతులు నిత్యం మదనపడుతుండేవా రు. దీనికి తోడు మొగిలి గొర్రెలు, బర్రెల వ్యాపారం చేస్తూ నష్టాల పాలయ్యాడు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా వారు వేర్వేరుగా ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరి స్థితి దారుణంగా ఉండడంతో కలత చెందిన లక్ష్మి గత నెల 27న సాయంత్రం పురుగుల మందు తాగింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన మొగిలికి భార్య పడుకుని ఉండి మంచం వద్ద పురుగుల మందు డబ్బా ఉండడంతో వెంటనే ఎంజీఎంకు తీసుకెళ్లాడు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. భర్త మొగిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
ట్రాక్టర్ అప్పు తీర్చలేక
ఉయ్యాలవాడలో యువకుడు..
డోర్నకల్: ట్రాక్టర్ కొనుగోలు కోసం చేసిన అప్పు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఉయ్యాలవాడలో చోటుచేసుకుంది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోటు సాయి(31) అప్పు చేసి ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ట్రాక్టర్ అప్పు సకాలంలో చెల్లించలేకపోవడంతోపాటు ఇతర అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై ఈ నెల 1వ తేదీన గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న సాయిని గుర్తించిన కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. సాయికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సాయిసింధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మహిళా కౌలు రైతు, ట్రాక్టర్ యజమాని బలవన్మరణం
శోకసంద్రంలో ఆయా కుటుంబాలు
ఉసురు తీసిన అప్పులు..
Comments
Please login to add a commentAdd a comment