నేటినుంచి ఇంటర్ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి(బుధవారం) ప్రారంభమయ్యే పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని డీఐఈఓ సీహెచ్.మదార్ గౌడ్ తెలిపారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా ఎటువంటి సెల్‌ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు వాడవొద్దని ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,317 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. కాగా పరీక్షకు 5నిమిషాలు ఆలస్యంగా వచ్చినవారిని కూడా లొనికి అనుమతిస్తామన్నారు.
నేటి నుంచి...
మార్చి 5నుంచి 22వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉదయం 8:45 గంటల లోపే విద్యార్థులు పరీక్ష హాల్‌లో కూర్చోవాలి. పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారుల తెలిపారు.
హాజరుకానున్న 9,317మంది విద్యార్థులు..
జిల్లావ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,317 మంది విద్యార్థులు హాజరకానున్నారు. ఇంటర్ ప్ర థమ సంవత్సరం విద్యార్థులు 3,196, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,716 మంది, ఒకేషనల్ ఫస్టి యర్ విద్యార్థులు 1,199 మంది, ఒకేషనల్ ద్వితీ య సంవత్సరం విద్యార్థులు 1,206 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. చీఫ్ సూపరింటెండెంట్లు 20మంది,డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు 20మంది, ఇన్విజిలేటర్లు 210 మంది విధులు నిర్వహిస్తారు.
జిల్లాలో 20 కేంద్రాలు..
జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 5 కేంద్రాలను ప్రైవేట్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల, ప్రభుత్వ బాలుర కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, మోడల్ స్కూల్ కళాశాల, నలంద, వికాస్, శ్రీవివేకానంద కాళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలాల వారీగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఓఎంఆర్ షీట్‌లో విద్యార్థుల ఫొటో ముద్రించబడి ఉంటుందని, అందుకు విద్యార్థులు ముందుగానే హాజరై ఓఎంఆర్ షీటును పూర్తిచేసి 9గంటలలోపే పరీక్షకు సిద్ధంగా ఉండాలన్నారు.
పరిశీలనకు ప్రత్యేక అధికారులు..
పరీక్షల పరిశీలకు సంబంధించిన ప్రత్యేక బృందాలు, అధికారులను ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు చేయగా కలెక్టర్ చైర్మన్‌గా, డీఐఈఓ, సీనియర్ ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉండి పరీక్షల నిర్వహణను పరిశీలిస్తారు. ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు సమాచారం అందిస్తారు. జిల్లాలో మూడు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అదే విధంగా పరీక్ష కేంద్రాల్లో చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
హాజరుకానున్న 9,317మంది విద్యార్థులు
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
జిల్లాలో పరీక్షలు రాసే విద్యార్థుల వివరాలు
జనరల్ ఫస్టియర్ విద్యార్థులు : 3,196
జనరల్ సెకండియర్ : 3,716
ఒకేషనల్ ఫస్టియర్ : 1,199
ఒకేషనల్ సెకండియర్ : 1,206
మొత్తం విద్యార్థులు : 9,317
హాల్‌టికెట్లు రాని విద్యార్థులు..
జిల్లాలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే విద్యార్థులు ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్ బీఐ వెబ్‌సైట్‌లో పుట్టిన తేదీ, పదో తరగతి హాల్‌టికెట్ నంబరు నమోదు చేసి డౌన్‌లోడ్ చే సుకోవచ్చు. కాగా ప్రైవేట్ కళాశాలల యాజ మాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
పరీక్ష కేంద్రాలు, అధికారుల వివరాలు
పరీక్ష కేంద్రాలు : 20
అధికారులు : 50
ఇన్విజిలేటర్లు : 210
సిట్టింగ్ స్క్వాడ్ : 3
ఫ్లయింగ్ స్క్వాడ్ : 1
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం తెలిపారు. బుధవారం నుంచి జరగనున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుశాఖ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ సెంటర్లు, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలన్నారు. పరీక్ష సెంటర్ల వద్ద నుంచి 200 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమిగూడవద్దని పేర్కొన్నారు.
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment