లైన్‌మెన్‌ల సేవలు అభినందనీయం
కురవి: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్‌మెన్‌ల సేవలు అభినందనీయమని మహబూబాబాద్ విద్యుత్ శాఖ డీఈఈ విజయ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో లైన్‌మెన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యుత్తమ సేవలందించిన పలువురు లైన్‌మెన్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24గంటల పాటు వినియోగదారులకు సేవలందించడంలో లైన్‌మెన్‌ల పాత్ర గొప్పదన్నారు. కార్యక్రమంలో ఏడీఈ రమేశ్, ఏఈలు సునీల్, కిరణ్, మహేందర్‌బాబు, సుమన్, శారద పాల్గొన్నారు.
క్రీడాకారులకు అభినందన
మహబూబాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఫిబ్రవరి 28నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగిన ఐదో రాష్ట్రస్థాయి బేస్‌బాల్ సబ్ జూనియర్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు రన్నర్‌గా నిలిచింది. కాగా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆ జట్టును కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి అభినందించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్లూరి ప్రభాకర్, డీవైఎస్‌ఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
వివరాలు నమోదు చేయాలి
● డీఎంహెచ్‌ఓ మురళీధర్
నెహ్రూసెంటర్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల డాటా ఎంట్రీ ఆపరేటర్లు గర్భధారణ ఫలితాలు, నవజాత శిశువులు, పిల్లల టీకాల వివరాలను యూ విన్ పోర్టల్‌లో నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ జి.మురళీధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. యూ విన్ పోర్టల్‌ను బలోపేతం చేసేందుకు డెలివరీ, శిశువు జనన, టీకాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్‌ఈ కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ వడ్డెబోయిన శ్రీనివాస్, డీడీఎం సౌమిత్, డీఈఓ శ్రీనివాస్, ఉమాకర్ పాల్గొన్నారు.
ఎండిపోతున్న
పంటల పరిశీలన
కేసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి, అర్పనపల్లి గ్రామాల సమీపంలోని వట్టివాగు పరీవాహకంలో ఎండిపోతున్న వరిపంటలను బీఆర్‌ఎస్, ఎంసీపీఐయూ పార్టీల నాయకులు మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు మంచాల యాకరాజ్యం, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ.. వట్టివాగులో నీళ్లు లేకపోవడంతో చుట్టుపక్కల సాగు చేసిన పంటపొలాలలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఎస్సారెస్పీ జలాలతో వట్టివాగును నింపి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎలబోయి న సారయ్య, సంకు శ్రీనివాస్‌రెడ్డి, యాకయ్య, వీరయ్య, బొల్లోజు రామ్మోహనాచారి, భద్ర య్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
లైన్‌మెన్‌ల సేవలు అభినందనీయం
లైన్‌మెన్‌ల సేవలు అభినందనీయం
లైన్‌మెన్‌ల సేవలు అభినందనీయం
Comments
Please login to add a commentAdd a comment