వీరభద్రుడి ‘పారువేట’
కురవి: భద్రకాళి సమేత వీరభద్రస్వామి(కల్యాణ వీరభద్రుడు) పారువేట(మృగవేట) కార్యక్రమాన్ని మంగళవారం ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెనుగొండ అనిల్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన శావ అశ్వవాహనంలో స్వామి వారి ఉత్సవమూర్తిని అధిష్టింపజేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం శావను మోస్తూ పరుగులు తీశారు. బాదె నాగయ్య ఇంటి వద్దకు చేరుకున్నాక శావకు గ్రామస్తులు భక్తులు, మహిళలు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి బిందెలతో నీటిని ఆరబోశారు. ధర్మకర్త చిన్నం గణేశ్, పూజారి తేజ, ఎర్ర నాగేశ్వరరావు, వద్దుల సురేందర్‌రెడ్డి, అవిరె మోహన్‌రావు, బాదె వీరభద్రంను బజారు పెద్దలు సన్మానించారు. కార్యక్రమంలో నవీన్, రాజు, తొడుసు ఉమేశ్, వీరన్న కొత్త యాకరాజు, చెవుల భరత్ పాల్గొన్నారు.
నేరడ ఎడ్ల బండికి స్వాగతం..
వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి రాళ్లు మోసిన కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన రుద్రారపు వంశీయుల మూడు జతల ఎడ్ల బండ్లకు ఆలయ అధికారి రవి, పూజారి రెడ్యాల శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ఎడ్లబండి ప్రదక్షిణలు చేయడంతో బండ్లు తిరిగే కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో రుద్రారపు వంశీయులు పాల్గొన్నారు.
వీరభద్రుడి ‘పారువేట’
Comments
Please login to add a commentAdd a comment