ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
గార్ల: రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీ ఏకమై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని మానుకోట ఎంపీ బలరాంనాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నా.. ప్రతిపక్షాలు నిత్యం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని ఆయా పార్టీల నాయకులను హెచ్చరించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్‌సౌకర్యం, వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. అనంతరం గార్ల రైల్వేస్టేషన్‌లో మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదలను పునరుద్ధరించాలని ఎంపీకి అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు. త్వరలో రైల్వే జీఎంతో మాట్లాడి రైలు నిలుపుదలకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణగౌడ్, పార్టీ జిల్లా సీనియర్ నాయకులు వెంకట్రామయ్య, ఎస్.వెంకట్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎం.వెంకట్‌లాల్, పృథ్వీరాజ్‌నాయక్, కె.సత్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎంపీ బలరాంనాయక్
Comments
Please login to add a commentAdd a comment