సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ రూరల్: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు సిబ్బందితో మంగళవారం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. వృత్తి నిర్వహణలో నైపుణ్యాలను పెంచుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, ఇందుకోసం నిత్యం వ్యాయామం, యోగా చేయడం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత, కుటుంబపరమైన, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని వివరించారు. టౌన్ డీఎస్పీ తిరుపతిరావు, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌళి, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్‌ఐలు అనిల్, భాస్కర్, సోములు, నాగేశ్వరరావు, సాయుధ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Comments
Please login to add a commentAdd a comment