‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్
సత్యనారాయణ రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల ఏంజిల్స్ హైస్కూల్‌లో మంగళవారం డీఈఓ, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించా రు. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల పాఠశాల స్థాయిలో స్పెషల్ టెస్టులు, గ్రాండ్ టెస్ట్‌ల ఫలితాలను అనాలసిస్ చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక కా ర్యాచరణ ద్వారా అభ్యసన సామర్థ్యాలు పెంచాలని సూచించారు. వార్షిక పరీక్షల సమయంలో 8, 9వ తరగతుల విద్యార్థులతో పదో తరగతి విద్యార్థులకు ఆల్‌ది బెస్ట్ విషెస్ చెప్పించాలన్నారు. నూతన డైట్ మెనూ షెడ్యూల్, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, చిన్నచిన్న మరమ్మతులకు ప్రతి పాదనలు చేయాలన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి, ఏడీ రాజేశ్వర్, అధికారులు చంద్రశేఖర్‌ఆజాద్, విజయకుమారి, అప్పారావు, శ్రీరాములు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment