10వ తేదీ వరకు అండర్ బ్రిడ్జి మరమ్మతులు
మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న పనులు ఈ నెల 10 తేదీ వరకు పూర్తవుతాయని అధికారులు మంగళవారం తెలిపారు. జనవరి 29వ తేదీ సాయంత్రం నుంచి పట్టణంలోని అండర్ బ్రిడ్జిలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఆసయమంలో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే అండర్ బ్రిడ్జి ప్రాంతంలో స్లాబ్ నిర్మాణ పనులు పూర్తికావచ్చినప్పటికీ దానిపైభాగంలో ట్రాక్ నిర్మా ణం జరగాల్సి ఉందని తెలిపారు. ఫిబ్రవరి 20న మరో 15రోజులపాటు గడువు పొడిగించి మార్చి 6వతేదీ వరకు పూర్తవుతాయని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఈనెల 10 తేదీ వరకు పనులు పూర్తిచేసి 11నుంచి అండర్ బ్రిడ్జిలో వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment