సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై సందిగ్ధంలో రైతులు
● మందకొడిగా అర్జీలు
● గడువు పెంచుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం
● మరోసారి ఈనెల 10వ తేదీకి పెంపు..
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో 327 మంది దరఖాస్తులు
హన్మకొండ : సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా సాధారణ, మధ్య తరగతి రైతులకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనే ఆసక్తి ఉన్నా.. ఆర్థిక స్థోమత అడ్డువస్తుండడంతో అర్జీలు చేసుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గడువు నిర్దేశించినా.. ఆశించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం గడువు పెంచుకుంటూ పోతోంది. ముందు ఫిబ్రవరి 22వ తేదీ వరకు చివరి గడువు నిర్ణయించింది. అయినా దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో మార్చి 2వ వరకు గడువు పొడిగించింది. అయినా లక్ష్యం మేరకు రైతుల నుంచి స్పందన లేక.. దరఖాస్తులు రాకపోవడంతో మరోసారి ఈ నెల 10 వరకు గడువు పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment