90 శాతం రుణ సౌకర్యం కల్పించాలని కోరుతున్న రైతులు
ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు రూ.2.97 కోట్ల ఖర్చు అవుతుంది. ఇందులో రైతులు 30 శాతం భరిస్తే బ్యాంకుల ద్వారా 70 శాతం రుణ సదుపాయం కల్పిస్తారు. 30 శాతం కింద రైతులు దాదాపు రూ.30 లక్షలు భరించాలి. దీనికి అదనంగా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు విద్యుత్ సరఫరా లైన్ వేసేందుకు కిలో మీటర్‌కు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. దీంతో పాటు సబ్‌స్టేషన్‌లో ‘బే’ఎక్స్‌టెన్షన్‌కు రూ.6.50 లక్షలు ఖర్చు అవుతుంది. వీటితో పాటు ఒక మెగావాట్ ఉత్పత్తికి దరఖాస్తు చేసుకునేందుకు రుసుం రూ.5 వేలు చెల్లించాలి. దరఖాస్తు రుసుం రూ. 5 వేలు తిరిగి చెల్లించరు. దీంతో సామాన్య, మధ్య తరగతి రైతులు ఈ ఖర్చులు భరించలేక సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ఊగిసలాడుతున్నారు. ఫలితంగా దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అయితే స్వయం సహాయక సంఘాలకు అందించనన్నుట్లు 90 శాతం రుణ సౌకర్యం కల్పిస్తే 10 శాతం భరించడం సులువవుతుందని రైతులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిబ్రవరి 21 వరకు 98 దరఖాస్తులు రాగా, ఈ నెల 2 వరకు 327 వచ్చాయి. రైతులకు రాయితీ ఇస్తే ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment