రైతులు ఖర్చు భరించడం కష్టమే..
రైతులు 30 శాతం ఖర్చు భరించడం కష్టమే. దీనికి తోడు విద్యుత్ లైన్ నిర్మాణం ఖర్చు, ఇతర ఖర్చులు భారీగా అవుతాయి. ఇవన్నీ రైతులు భరించలేరు. నాకు ప్రైవేట్ పవర్ ప్లాంట్‌లో పని చేసిన అనుభవముంది. దీంతో ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుందని తెలుసుకుని దరఖాస్తు చేశా. నాకు 8 ఎకరాల స్థలం ఉంది. మెగావాట్ ప్లాంట్‌కు దరఖాస్తు చేశా. దీని ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంకుకు చెల్లించా ల్సిన వాయిదాలు సంతృప్తి కలిగితే మిగతా స్థలంలో ఏర్పాటు చేస్తా.
– పి.అంబేడ్కర్, అంబేడ్కర్ నగర్, వర్ధన్నపేట
రైతులు క్రమంగా ముందుకు వస్తున్నారు..
సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి రైతులు క్రమంగా ముందుకు వస్తున్నారు. రైతుల ఆసక్తిని గమనించి ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇప్పటి వరకు ఆశించిన మేర దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు గడువు పెంచింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మహేందర్ రెడ్డి, రెడ్‌కో ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్
●
రైతులు ఖర్చు భరించడం కష్టమే..
Comments
Please login to add a commentAdd a comment