పర్యాటకులూ..జర జాగ్రత్త
● పాకాల సరస్సు ఒడ్డుపైకి చేరిన మొసలి
● సరస్సులో దిగొద్దని ఎఫ్‌ఆర్వో సూచన
ఖానాపురం: వరంగల్ జిల్లాలో ఏకై క పర్యాటక ప్రాంతం పాకాల. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అటవీ అందాలను వీక్షించిన అనంతరం సరస్సులో జలకలాడుతారు. అయితే ఇప్పటి నుంచి సరస్సులో దిగకుండా ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే మంగళవారం మొసలి.. సరస్సు ఒడ్డుకు చేరుకుని సేదదీరింది. దీంతో పర్యాటకులు సరస్సులో దిగొద్దని ఎఫ్‌ఆర్వో రవికిరణ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment