కరెంట్‌తో చేపలు పడుతూ మృత్యుఒడికి..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి
● పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగులో ఘటన
మరిపెడ రూరల్: మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు.. కరెంట్‌తో చేపలు పడుతూ షా క్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగులో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నా యి. పురుషోత్తమాయగూడెం స్టేజీకి చెందిన జర్పుల కోట, అరుణ దంపతుల చిన్న కుమారుడు శశి (20) అదే గ్రామానికి చెందిన మిత్రులతో కలిసి ఆకేరు వాగులో చేపల వేటకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌ను ఉపయోగించి చేపలు పడుతున్న క్రమంలో అదే విద్యుత్ తీగలకు తగిలి షాక్ గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని శశి మృతదేహం మీద పడి గుండలవిసేలా రోదించారు. కష్టపడి పెంచి పెద్ద చేస్తే ఇలా అర్ధాంతరంగా పోయావా కొడుకా అంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. శశి మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.
చెరువులో జారిపడి వృద్ధుడు..
స్టేషన్‌ఘన్‌పూర్: చెరువులో జారిపడి ఓ వృద్ధుడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పాంనూర్‌లో జరిగింది. పోలీ సులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్లె నర్సయ్య(65) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం గ్రామశివారులోని ఊర చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి అందులో జారి పడ్డాడు. కాగా, నర్సయ్య చెరువు వైపునకు వెళ్లడం చూసిన గొర్రెల కాపరులు..అతడు తిరిగి రాకపోవడంతో అనుమానంతో చెరువు వద్దకు వెళ్లి చూశారు. అక్కడ చెప్పులు కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబీకులు గొర్రెల కాపరుల సాయంతో చెరువులో మునిగిన నర్సయ్యను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి బంధువు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.
కరెంట్‌తో చేపలు పడుతూ మృత్యుఒడికి..
Comments
Please login to add a commentAdd a comment