ఉపాధి అవకాశాల మధ్య అగాధం
కేయూ క్యాంపస్ : తెలంగాణలో కొన్ని వర్గాలు పని చేయడానికి విముఖతతో ఇతర రాష్ట్ర కార్మికులు వలస వస్తున్నారని, దీని వల్ల ఉపాధి అవకాశాల మధ్య అగాధం పెరిగిందని సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కేయూ గణిత శాస్త్ర విభాగ సెమినార్ హాల్‌లో వీసీ కె. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆచార్య బి. జనార్ధన్ రావు 23వ వార్షిక స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ప్రధాన వక్తగా విచ్చేసి ‘తెలంగాణ ఆఫ్టర్ ఎ డికెడ్ ఎమర్జింగ్ పొలిటికల్ అండ్ సోషల్ సీనారియోస్’ అనే అంశంపై శ్రీనివాస్ ప్రసంగించారు. భవిష్యత్ తెలంగాణకు విలువలతో కూడిన విధాన చట్రం అవసరమన్నారు. గొప్ప తాత్త్విక సిద్ధాంతకర్త ఆచార్య బి. జనార్ధన్ రావు అన్నారు. సమగ్ర అభివృద్ధితో కూడికొని ఉహించిన తెలంగాణ రూపకల్పన చేశారన్నారు. ఆయన ఊహకు అనుగుణంగా అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ గ్రామాలు డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్‌లు వ్యసనాల బారిలో పడి చిక్కుకున్నాయన్నారు. అలాగే, ఉపాధి అవకాశాల మధ్య అగాధం పెరిగిందన్నారు. చిరు వ్యాపారుల్లో ఉత్తరాది వారి ప్రాబల్యం పెరిగిందన్నారు. దీని నివారణకు జోక్యం అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో బియ్యాల జనార్ధన్ రావు మెమోరియల్ ఫౌండేషన్ బాధ్యులు ఈ.రేవతి, కె. మురళీ మనోహర్, నరేంద్ర బాబు, జనార్ధన్ రావు ట్రస్టు కార్యదర్శి టి. బుచ్చిబాబురావు, తదితరులు పాల్గొన్నారు. తొలుత జనార్ధన్‌రావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment