సృజనాత్మకత పెంపునకు ఫెస్ట్‌లు దోహదం
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్
రామన్నపేట: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు ఫెస్ట్‌లు ఎంతో దోహదపడుతాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. కళాశాల ప్రాంగణంలో జిల్లాస్థాయి ‘సృజనా టెక్‌ఫెస్ట్ (2024 – 25)ను మంగళవారం నిర్వహించారు. టెక్ ఫెస్ట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఎన్‌ఐటీ ప్రొఫెసర్ ఎ.కుమార్, టీజీఆర్‌టీసీ హనుమకొండ డిప్యూటీ రీజనల్ మేనేజర్ జి.మాధవరావు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈమేరకు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పరకాలకు మొదటి బహుమతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్‌కు రెండో బహుమతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కాటారంనకు మూడో బహుమతి, కంప్యూటర్ సైన్ ఇంజనీరింగ్ విభాగంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్‌కు మొదటి బహుమతిని అతిథులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభా గాధిపతి, జిల్లా కోఆర్డినేటర్ ఎం.వెంకన్న, కంప్యూటర్ సైన్స్ ఇన్‌చార్జ్ విభాగాధిపతి, జిల్లా కోఆర్డినేటర్ ఎస్.రవీందర్, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment