● హోలీ,ఉగాది, రంజాన్ పండుగలకు
రూ. లక్ష మంజూరు
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఈసీసీఎస్) లిమిటెడ్.. హోలీ, ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా రైల్వే సీసీఎస్ షేర్ హోల్డర్స్(సభ్యులు)కు రుణాల మంజూరు ప్రకటించిందని కాజీపేట రైల్వే సీసీఎస్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ యాదవ్, కోఆప్షన్ డైరెక్టర్ దేవులపల్లి రాఘవేందర్ బుధవారం తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్ చిలుకు స్వామి, వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ నేతృత్వంలో సీసీఎస్ సభ్యులకు ఫెస్టివల్ లోన్ ఇచ్చేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన రైల్వే సీసీఎస్ సభ్యులు ఈ ఫెస్టివల్ లోన్‌కు ఈ నెల 6వ నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫెస్టివల్ లోన్‌గా సీసీఎస్ సభ్యులకు రూ. లక్ష మంజూరు చేయనున్నట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment