నాణ్యతాప్రమాణాలు లేని పాలు
● టెస్ట్ చెక్‌లో గుర్తించినట్లు వెల్లడి
వరంగల్: వరంగల్ పోచమ్మ మైదాన్‌లో హనుమకొండ విజయ డెయిరీలో ‘పాల నాణ్యత’పై బుధవారం టెస్ట్ చెక్ నిర్వహించగా ప్యాకెట్లపై పేర్కొన్న విధంగా ప్రమాణాలు లేవని వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. వినియోగదారుల మండలి సేకరించిన(19) ప్రైవేట్ డెయిరీల పాల నాణ్యతాపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పాల ప్యాకెట్‌లపై ము ద్రించిన ప్రకారం వెన్న శాతం, పాలు ఎక్కువ రో జులు నిల్వ ఉండడానికి కలిపే హైడ్రోజన్ పెరాకై ్స డ్, కాస్టిక్ సోడాలకు సంబంధించిన నాణ్యతా పరీ క్షలు నిర్వహించినట్లు తెలిపారు. విజయ డెయిరీ పోలికతో ఉన్న ప్రైవేట్ డెయిరీ పాలలో కాస్టిక్ సోడా కలిపినట్లు తేలిందన్నారు. అలాగే, ఆరు ప్రైవే ట్ డెయిరీలు తమ ప్యాకెట్‌లపై ముద్రించిన ప్రకా రం వెన్న శాతం పాలలో లేదని నిర్ధారణ అయ్యిందన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక, విజయ డెయిరీ డీడీ శ్రవణ్‌కుమార్, మేనేజర్ ప్రదీప్ ఆధ్వర్యంలో పాల నాణ్యతా పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో మండలి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రావుల రంజిత్ కుమార్, నల్లా రాజేందర్, చిలువేరు ప్రవీణ్, నగర కార్యదర్శి బేతి రాజేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment