అనంతాద్రికి బ్రహ్మోత్సవ శోభ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈమేరకు మొదటగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం పటిస్తారు. అనంతరం అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 12న ఉదయం 9.30 గంటలకు గరుడ ప్రసాదం పంపిణీ, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, దేవతాహ్వాన పూజలు, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు. 13న ఉదయం 9.30 గంటలకు 25 కలశాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం, 14న ఉదయం 9.30 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం, అదేరోజు సాయంత్రం ఎదుర్కోలు నిర్వహించనున్నారు. 15న ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కల్యాణం జరగనుండగా.. అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 16న ఉదయం 9.30 మహాపూర్ణాహుతి, చక్ర తీర్థోత్సవం, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, పవళింపు సేవ, మహాదాశీర్వచనం పూజలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి 16వరకు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అనంతాద్రికి బ్రహ్మోత్సవ శోభ
Comments
Please login to add a commentAdd a comment