ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
వెంకటాపురం(కె): మండలంలోని పాత్రాపురం గ్రామ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆర్టీసీ బస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి వెంకటాపురం మండల కేంద్రానికి వస్తోంది. ఈ క్రమంలో పాత్రాపురం గ్రామ సమీపంలోకి వచ్చే సమయానికి బస్సు వెనుక చక్రం బోల్టు విరిగి ఊడింది. దీంతో బస్సు రోడ్డు మీద నుంచి పక్కకు వెళ్తుండగా డ్త్రెవర్ చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకొచ్చాడు. దీంతో బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment