మా బంగారం ఇవ్వండి..
రాయపర్తి: చోరీకి గురైన బంగారం ఇవ్వండి.. లేదంటే ప్రస్తుతం మార్కెట్‌లో తులం గోల్డ్‌కు ఉన్న ధర ప్రకారం డబ్బు ఇవ్వాలి.. తరుగు తీసి డబ్బు చెల్లిస్తామంటే తీసుకోబోమని బంగారం బాఽధితులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐలో ఆందోళన చేపట్టారు. కాగా, 2024 నవంబర్ 18న బ్యాంకులో 497 మందికి సంబంధించిన 19 కిలోల బంగారు ఆభరణాలను చోరీకి గురైన విషయం విధితమే. ఈ ఘటనలో బాధితులకు పరిహారం ఇవ్వడానికి అధికారులు.. బాధితులను బ్యాంకు పిలిపించారు. ‘మీరు బ్యాంకులో దాచుకున్న బంగారం చోరీకి గురైంది.. ఈ కేసు కోర్టులో ఉంది. ప్రస్తుతం తులం బంగారానికి రూ.77,710 అందిస్తాం’ అని చెప్పారు. దీంతో బాధితులు ససేమిరా అన్నారు. ప్రస్తుతం తులం బంగారం రూ. 87వేలు ఉందని, మేం పదితులాలకు తులం బంగారం తరుగు కోల్పోవాలా అంటూ నిలదీశారు. చోరీకి గురైన బంగారం ఇవ్వండి.. లేదా ప్రస్తుతం గోల్డ్‌కు ఉన్న ధర ప్రకారం డబ్బు ఇవ్వాలని, తరుగు తీయొద్దని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీలేకపోవడంతో బ్యాంకు అధికారులు మరో వారం రోజుల తర్వాత రావాలని చెప్పడంతో బాధితులు వెనుదిరిగారు. కాగా, బ్యాంకులో భరోసా ఉంటుందని దాచుకుంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే బంగారం చోరీకి గురైందని బాధితులు ఆరోపించారు. బ్యాంకుకు సెక్యూరిటీని నియమించకపోవడంతోనే చోరీ జరిగిందని మండిపడ్డారు. పరిహారం చెల్లించాలని నాలుగు నెలల నుంచి బ్యాంకు చుట్టు ప్రదక్షణలు చేస్తున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
తులానికి గ్రాము తీసేస్తే ఎట్లా..
తులం బంగారానికి గ్రాము తరుగు తీసేసి డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మూడు తులాల తాడు చేయించుకోవాలంటే ఎంతో ఇబ్బంది. వాళ్లు డబ్బులు కట్టిస్తే ఎదో అప్పుకింద పోతుంది. ఆడపిల్లలకోసం బంగారు ఆభరణాలు చేయించుకున్నం. బ్యాంకుకు ఎంత వడ్డీ అయ్యిందో చెల్లిస్తాం. మా బంగారం మాకు ఇవ్వాలి.
–కోల హైమ, మైలారం
తరుగు తీసి డబ్బులు కట్టిస్తామంటున్నారు
అధికారుల నిర్లక్ష్యంతోనే బ్యాంకులో చోరీ జరిగింది. బంగారం పోయిన రోజు గుర్జకూడా పోకుండా ఇస్తామని బాధితులకు చెప్పిన బ్యాంకు అధికారులు.. ఇప్పుడు బంగారంలో తరుగు తీసి డబ్బులు కట్టిస్తామంటున్నారు. పది తులాల బంగారానికి తులం లాస్ అవుతున్నాం. ఎంత మిత్తి అయ్యిందో అంత చెల్లిస్తం. మా బంగారం మాకు ఇప్పించాలి.
–పగిడిపల్లి భీంరెడ్డి, మైలారం
ఎస్‌బీఐలో బాధితుల ఆందోళన
చోరీకి గురైన బంగారం ఇవ్వాలని డిమాండ్
లేదా ప్రస్తుతం గోల్డ్‌కు ఉన్న
ధర ప్రకారం డబ్బు చెల్లించాలి
తరుగు తీసి డబ్బు చెల్లిస్తామంటే తీసుకోబోమని స్పష్టీకరణ
గత సంవత్సరం బ్యాంకులో
19 కిలోల పసిడి చోరీ
పరిహారం ఇవ్వడానికి ఖాతాదారులను
పిలిచిన అధికారులు
మా బంగారం ఇవ్వండి..
మా బంగారం ఇవ్వండి..
Comments
Please login to add a commentAdd a comment