ఆటోను ఓవర్ టేక్ చేయబోయి..
● స్కూటీని ఢీకొన్న బైక్
● తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి
నెక్కొండ: బైక్.. ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. ఈఘటన బుధవారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన చిన్నబోయిన సంతు మరొకరితో కలిసి బైక్‌పై నెక్కొండ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మోడల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న నెక్కొండకు చెందిన మహ్మద్ సాజిద్ (16) స్కూటీపై నెక్కొండకు వస్తున్నాడు. ఈ క్రమంలో నెక్కొండ– అప్పల్‌రావుపేట ప్రధాన రహదారిపై మండల కేంద్రంలో ఆటోను ఓవర్ టేక్ చేయబోయిన సంతు..ఎదురుగా వస్తున్న సాజిద్ స్కూటీని ఢీకొ న్నాడు. ఈ ఘటనలో సాజిద్, సంతుతోపాటు మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా సాజిద్ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మదార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు.
మరియపురంలో బైక్ అదుపు తప్పి విద్యుత్ ఉద్యోగి..
గీసుకొండ: విధులకు వెళ్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి బైక్ అదుపు తప్పడంతో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మరియపురంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన ఓరుగంటి రమేశ్(50) 12 సంవత్సరాల క్రితం గీసుకొండకు వలస వచ్చాడు. గీసుకొండ(కొనాయమాకుల) విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో అన్‌మ్యాన్డ్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఊకల్ నుంచి ఓ విద్యుత్ వినియోగదారుడు ఫోన్ చేసి తమ గ్రామంలో కరెంట్ లేదని చెప్పాడు. దీంతో బైక్‌పై మరియపురం నుంచి ఊకల్‌వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముందు ఉన్న సంచిలోని సామగ్రి హ్యాడిల్‌ను తిరగకుండా చేయడంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొంది. దీంతో రమేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, రమేశ్ మృతిపై ఏఈ సంపత్‌రెడ్డి, విద్యుత్ సిబ్బంది సంతాపం తెలిపారు.
అజ్నీ ప్యాసింజర్ పునరుద్ధరణ..
● నేటి నుంచి పట్టాలెక్కనున్న రైలు
● కాజీపేట–బల్హార్షా ఎక్స్‌ప్రెస్‌గా మార్పు
కాజీపేట రూరల్ : కరోనా సమయంలో రద్దు చేసిన అజ్నీ ప్యాసింజర్‌ను పునరుద్ధరించారు. గురువారం నుంచి యథావిధిగా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 6నుంచి కాజీపేట జంక్షన్ నుంచి ప్రతీ రోజు రాత్రి 10.50 గంటలకు బయలుదేరే కాజీపేట–బల్హార్షా (17035) ఎక్స్‌ప్రెస్ ఉదయం 3.50 గంటలకు బల్హార్షాకు చేరుతుంది. అదేవిధంగా బల్హార్షాలో ఈ నెల 7వ తేదీన ఉదయం 3.50 గంటలకు బయలుదేరే బల్హార్షా–కాజీపేట (17036) ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు 8.50 గంటలకు చేరుతుంది. ఈఎక్స్‌ప్రెస్‌కు ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, రెచ్నిరోడ్, సిర్పూర్‌కాగజ్‌నగర్, వీరూర్, వీర్గం, మణిఘర్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు కాజీపేట రైల్వేస్టేషన్ మేనేజర్ రవీందర్ తెలిపారు.
నాటి అజ్నీ ప్యాసింజరే నేటి ఎక్స్‌ప్రెస్‌గా..
గతంలో కాజీపేట–అజ్నీ–కాజీపేట మధ్య ప్రయాణించే ఈ ప్యాసింజర్‌ను కరో నా సమయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు 2023, నవంబర్ 13వ తేదీన ర ద్దు చేశారు. దాదాపు 17 నెలల తర్వాత ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ అజ్నీ ప్యాసింజర్‌ను కాజీపేట–బల్హార్షా–కాజీ పేట మధ్య మెయిల్ డైలీ ఎక్స్‌ప్రెస్‌గా న డిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చాలా కా లం తర్వాత ఈ రైలును ప్రవేశపెట్టడంతో కాజీ పేట నుంచి బల్హార్షా మార్గంలో వెళ్లే ప్రయాణికులు, ఇతర వర్గాల వారికి సౌకర్యంగా ఉంటుంది. కాగా, ఈ రైలును పునరుద్ధరించడంతో ప్ర యాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆటోను ఓవర్ టేక్ చేయబోయి..
ఆటోను ఓవర్ టేక్ చేయబోయి..
Comments
Please login to add a commentAdd a comment