ఇస్రో పిలుస్తోంది.. వెళ్దాం రండి
మహబూబాబాద్ అర్బన్ : అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ వివరాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది.
23వ తేదీ వరకు గడువు..
విద్యార్థులు మార్చి 23వ తేదీలోగా www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా– 25 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 31న ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.
7 కేంద్రాల్లో నిర్వహణ..
ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్(గుజరాత్), హైదరాబాద్(తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ).
అన్నీ ఉచితంగానే..
ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భో జన, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పే సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్తగ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు.
ఎవరు అర్హులు..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్‌లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం
యువికా కార్యక్రమానికి
23వ తేదీ వరకు గడువు
7 కేంద్రాల్లో నిర్వహణ
ప్రయాణం, వసతి సౌకర్యాలు ఉచితం
Comments
Please login to add a commentAdd a comment