నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Published Thu, Mar 6 2025 1:42 AM | Last Updated on Thu, Mar 6 2025 1:42 AM

నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

రామన్నపేట : అన్నదాతలను మోసం చేస్తూ నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి టాస్‌ఫోర్స్‌, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. వీరి నుంచి సుమారు రూ.34 లక్షల విలువైన వివిధ కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ పురుగు మందులు, రెండు కార్లు, ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ పురుగు మందు లేబుళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం టాస్క్‌ఫోర్స్‌, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా వరంగల్‌ గోపాలస్వామి గుడి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో తనిఖీ చేయగా పురుగు మందుల డబ్బాలు కనిపించాయి. కారులో ఉన్న నిందితుల్లో ఒకరైన కర్ణాటకలోని బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన నిందితుడు కాట్రగౌడ భాస్కర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లు అంగీకరించడంతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా మంగళవారం నిందితుడు కాట్రగౌడ భాస్కర్‌ రెడ్డి సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్‌ చర్లపల్లి ప్రాంతంలోని గోడౌన్‌పై దాడి చేసి మిగతా నలుగురు నిందితులు హైదరాబాద్‌ కుషాయిగూకు చెందిన పిల్ల నాగవెంకటరంగారావు, లక్డీకాపూల్‌కు చెందిన ముద్దంగుల ఆదిత్య, దూదిమెట్లకు చెందిన పిట్ల నవీన్‌, మిర్యాలగూడ ఇందిరమ్మకాలనీకి చెందిన దూదిమెట్ల శ్రీధర్‌ను విచారించారు. డిమాండ్‌ ఉన్న కంపెనీ పేర్లతో నకిలీ పురుగు, గడ్డి మందులు తయారీ చేసి విక్రయించి రైతులను మోసం చేసున్నట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్‌ చేసి బేయర్‌, టాటా, కోర్టెవాతోపాటు మరో నాలుగు కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ పురుగు మందులు, గడ్డి మందులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా, టాస్క్‌ఫోర్‌, వరంగల్‌ ఏసీపీలు మధుసూదన్‌, నందిరాంనాయక్‌, టాస్క్‌ఫోర్‌, మట్టెవా డ ఇన్‌స్పెక్టర్లు సార్ల రాజు, గోపి, ఎస్సైలు ఓరుగుంటి భానుప్రకాశ్‌, లచ్చయ్య, సాంబయ్య, ఏఏఓ సల్మాన్‌ పాషా, కానిస్టేబుళ్లు సురేశ్‌, సాంబరాజు, సురేందర్‌, రమేశ్‌ను సీపీ అభినందించారు.

రూ.34 లక్షల విలువైన మందులు,

రెండు కార్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement