
డీఎన్‌ఏ.. వ్యక్తిగత జీవితానికి ఆధారం
కేయూ క్యాంపస్: డీఎన్‌ఏ.. వ్యక్తిగత జీవితానికి ఆధారమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘యూసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డీఎన్‌ఏ టెక్నాలజీ ఇన్ హెల్త్’ అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్ ప్రారంభ సభలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న మాలిక్యూల్ వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు దేశాల ఆర్థిక వ్యవస్థను కూడా మార్చుతుందన్నారు. వ్యాధుల నివారణ, చికిత్సల్లో అపరిమితమైన ఆవశ్యకత ఉందన్నారు. కోవిడ్–19 సమయంలో డీఎన్‌ఏ ప్రధాన భూమిక వహించిందన్నారు. రోగనిరోధక వ్యవస్థ , యాంటీబాడీల అభివృద్ధిలో కరోనా సమయంలో వ్యాక్సిన్‌ల ప్రాధాన్యతను గుర్తుచేశారు. భారతదేశం వ్యాక్సిన్ల హబ్‌గా నిలిచిందన్నారు. పబ్లిక్‌హెల్త్‌లో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తితో వ్యయం తగ్గుతుందన్నారు. ఆ దిశగానే పరిశోధనలు కొనసాగించాలన్నారు. సమావేశంలో జూవాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ జి. షమిత, సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, ఆచార్యులు మామిడాల ఇస్తారి, వై. వెంకయ్య, ఈసం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment