నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
ఏటూరునాగారం/వెంకటాపురం(కె): నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపా రు. ఈమేరకు బుధవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన ఛత్తీస్‌గఢ్ బార్డర్ దాటి వెంకటాపురం(కె) మండలం కొత్తపల్లి వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మావోయిస్టు కొరియర్లు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాడిసె అనిల్, కుర్హామి భామన్, మడవి సుక్కు, సోడి ఇడుమాల్.. పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. అనిల్, భామన్, సుక్కు, ఇడుమాల్.. ఈనెల 2వ తేదీన మావోయిస్టుల వద్ద డబ్బులు తీసుకుని 3వ తేదీన చర్ల ప్రాంతంలో దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ చార్జర్లు, బూట్లు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి మావోయిస్టులకు ఇవ్వడానికి వెళ్లే క్రమంలో 4వ తేదీన విజయపురికాలనీ(కొత్తపల్లి) వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఏజెన్సీ ప్రజలు నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరించొద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment