ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీయడిట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) సీహెచ్.మదార్‌గౌడ్ తెలిపారు. జనరల్ స్టూడెంట్లు 3,230 మంది విద్యార్థులకు 3,149 మంది హాజరుకాగా 81 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 1,068 మంది విద్యార్థులకు 1,015 మంది విద్యార్థులు హాజరుకాగా 53 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తానికి 4,298 మందికి గాను 4,164 మంది విద్యార్థులు హాజరుకాగా 134 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌లు జరగలేదని, ప్రశాంతంగా తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలిక కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు వెనుతిరిగాడు. అనంతారం మోడల్ కళాశాలలో డీఐఈఓ మదార్‌గౌడ్, ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
మొదటి రోజు 134 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment