ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే నిర్మాణ అనుమతి
మహబూబాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే గృహ ని ర్మాణ అనుమతి ఇస్తామని మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులతో పాటు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మెప్మా ఆర్పీలతో సమావేశం నిర్వహించి ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ 2020 కంటే ముందు లేఅవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసి రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వారికి ఎల్‌ఆర్‌ఎస్ అనుమతి ప్రభుత్వం కల్పించిందన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 12,201 దరఖా స్తులు రాగా దానిలో 1,670 ఆమోదించినట్లు తెలి పారు. ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయి తీ ఉందని మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించాలన్నారు. దరఖాస్తుదారుడి సెల్ నంబర్ రిజిస్ట్రేషన్ దానిపై ఉన్న నంబర్ నమోదు చేయగానే ఓటీపీ రాగానే ఫీ జు చెల్లించాల్సి వస్తుందన్నారు. సిబ్బంది కూడా ఎల్‌ఆర్‌ఎస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించా లన్నారు. ఈ సమావేశంలో టీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ రవీందర్
Comments
Please login to add a commentAdd a comment