పార్కులో వసతులు కల్పించాలి
డోర్నకల్: బతుకమ్మ పార్కుకు వచ్చే వారి కోసం వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్‌వత్సవ్ టొప్పో ఆదేశించారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని బతుకమ్మ పార్కును గురువారం అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. పార్కులోని మొక్కలను పరిశీలించి ఎండాకాలం వచ్చినందున మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్కులోకి వాకింగ్, జిమ్ కోసం వచ్చే వారికి మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. అనంతరం బంకట్‌సింగ్‌తండాలోని ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేయగా ఆ సమయంలో పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఉండటంతో ఆశ్యర్యం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారని ప్రశ్నించగా ఇక్కడి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారని ఉపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
Comments
Please login to add a commentAdd a comment