అస్తిత్వానికి ఆయువు పట్టు ఆంగ్ల భాష
● కెన్యా ప్రొఫెసర్ కుప్పు రామ్
● కేడీసీలో అంతర్జాతీయ సదస్సు
విద్యారణ్యపురి: ఆంగ్ల భాష మన అస్తిత్వానికి ఆయువు పట్టువంటిదని విభిన్న భాషా సంస్కృతులను గౌరవించేదిగా ఇంగ్లిష్ విలసిల్లాలని కెన్యా మసింది ములురో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కుప్పు రామ్ అన్నారు. గురువారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీ డిసిప్లీనరీ కాంటెక్ట్స్ ఇన్‌ది ఎరా’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కెన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ కీలకోపన్యాసం చేశారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఈ.వేదశరణ్, కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment