యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Published Sat, Mar 8 2025 1:54 AM | Last Updated on Sat, Mar 8 2025 1:50 AM

యంగ్‌

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

మహబూబాబాద్‌ రూరల్‌: తెలంగాణ పోలీస్‌ కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ సంబంధించిన పోస్టర్‌ను ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌ ద్వారా సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లలో పోలీస్‌ అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారన్నారు. సైనిక్‌ స్కూల్‌ తరహాలో దేశానికి ఒక రోల్‌ మోడల్‌లా పిల్లలను తీర్చిదిద్దేలా ఈ స్కూల్‌ ఉంటుందన్నారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించడం, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడం స్కూల్‌ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమౌళి, ఆర్‌ఐలు సోములు, భాస్కర్‌, ఐటీ సెల్‌ ఎస్సై అరుణ్‌ కుమార్‌, శ్రీధర్‌, రవి పాల్గొన్నారు.

హెడ్‌ కానిస్టేబుల్‌,

కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లాలోని పెద్ద వంగర పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రాజారాం, కానిస్టేబుల్‌ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ మల్టీ జోన్‌ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద వంగర పోలీస్‌ స్టేషన్‌ విశ్రాంతి గదిలో హెడ్‌ కానిస్టేబుల్‌ రాజారాం, కానిస్టేబుల్‌ సుధాకర్‌ ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం సేవించారనే ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ సదరు ఘటనపై విచారణ జరిపి హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌పై రిపోర్ట్‌ పంపగా వారిని సస్పెండ్‌ చేస్తూ మల్టీ జోన్‌ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

మెరుగైన ఫలితాలు సాధించాలి

కురవి/నెల్లికుదురు: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కురవి, నెల్లికుదురు మండలాల్లోని పలు పాఠశాలల్లో జరుగుతున్న టెన్త్‌ ప్రీఫైనల్‌ పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలో ఆన్సర్‌ బుక్‌లెట్‌ గురించి వివరించారు. ఓఎంఆర్‌ షీట్‌ డిస్‌ప్లే వినియోగం తీరును వివరించారు. లోటుపాట్లను సరిదిద్దుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఇష్టపడి చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాలలో లోకాస్ట్‌, నోకాస్ట్‌ యూరినల్‌ యూనిట్లు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు, హెచ్‌ఎం ఎ.రవికుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులు

నిబంధనలు పాటించాలి

తొర్రూరు: ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌ఓ గుండాల మురళీ ధర్‌ అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని పలు ప్రై వేట్‌ ఆస్పత్రులను శుక్రవారం వైద్యాధికారులు తనిఖీ చేశారు. అనుమతులు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రిలో ఫీజుల వివరాలు, వై ద్యుల పేర్లు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులనే డ్యూటీ డాక్టర్లను నియమించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులు రాష్ట్ర వి ద్యా మండలిలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే వై ద్యం చేయడానికి అనుమతించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ1
1/2

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ2
2/2

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement